గణేష్ ఉత్సవ కమిటీలకు అండగా ఉంటాం – బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్

0
1613

👉 బాల గంగాధర్ తిలక్ ఆదర్శాలను హిందూ సమాజం అనుసరిస్తూ ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకునేందుకు సిద్ధం.

👉 గణేష్ ఉత్సవాల నిర్వహణపై టిఆర్ఎస్ ప్రభుత్వ కుట్రలను ధీటుగా ఎదుర్కొంటాం.

👉 గణేష్ ఉత్సవ నిర్వాహకులకు అండగా ఉంటాం.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6860892811892727″
data-ad-slot=”3425137284″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా ఉన్న సమయంలో రంజాన్ మాసంలో బిర్యానీలు, కాజు పిస్తాలు అందించిన టిఆర్ఎస్ ప్రభుత్వం.. కనీసం గణేష్ ఉత్సవాల సందర్భంగా పులిహోర నైవేద్యాన్ని సమర్పించే అవకాశాలు కల్పించకుండా కఠిన కుట్రలు చేస్తోంది. ఆంక్షలు అడ్డంకులు సృష్టిస్తోంది. ఓవైసీ సోదరుల చేతుల్లో కీలుబొమ్మగా మారి ప్రతి ఏడాది గణేష్ ఉత్సవాలకు అడ్డంకులు సృష్టించడం కెసిఆర్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. దీన్ని యావత్ తెలంగాణ సమాజం గమనించాలి. సాంప్రదాయ పద్ధతిలో ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలు నిర్వహించడం హిందూ సమాజానికి సహజమైన అలవాటు. ఈ సహజ ప్రక్రియను అడ్డుకుంటే, ఇబ్బందులు కలిగిస్తే హిందూ సమాజం రాజకీయ నిర్ణయాలు తీసుకునే దిశగా ఆలోచిస్తోంది.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని, ఒక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకే గణేశ్ ఉత్సవాలపై అడ్డంకులు సృష్టిస్తూ.. నిర్వాహకులపై పోలీసులతో కెసిఆర్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది. లోపాయికారి అవగాహనతో కలిసి కుట్రలు చేస్తున్న టిఆర్ఎస్ – ఎంఐఎం పార్టీలకు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో, జాగ్రత్తగా ఉత్సవాలను నిర్వహించుకోవడం మన బాధ్యత. ఈ సమయంలో ధార్మిక సంస్థలు,హిందూ ఉత్సవ సమితులు నిర్దేశించిన విధంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని బిజెపి పిలుపునిస్తోంది. అధికారుల నుంచి, పోలీసుల నుంచి ఉత్సవ నిర్వాహకులకు ఇబ్బందులు, బెదిరింపులు ఎదురైతే స్థానిక హిందూ ధార్మిక సంస్థలను, బిజెపిని సంప్రదించాలి. సమాజాన్ని సంఘటితం చేసే గణేష్ ఉత్సవాలకు నాంది పలికిన బాల గంగాధర్ తిలక్ ఆదర్శాలను హిందూ సమాజం అనుసరిస్తూ ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకునేందుకు సిద్ధంగా ఉంది. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుస్తున్న ప్రభుత్వ చర్యలను బిజెపి దీటుగా ఎదుర్కొంటుంది. సామూహిక, సామాజిక, సంఘటిత శక్తిగా హిందూ సమాజం మారి గణేష్ ఉత్సవాలకు అడ్డంకిగా మారిన టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటాలు నిర్వహిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here