జాతీయగీతం
జనగణమన అధినాయక జయహే..
‘జై హింద్’ అనే నినాదమే దేశంలో కొందరికి ఇష్టం లేని పరిస్థితి. ‘భారత్ మాతా కీ జై’ అని నినదించడానికి ఆ కొందరికి ‘మతం’ అడ్డు వచ్చేస్తోంది. సరిహద్దుల్లో తుపాకీ చేత పట్టి, దేశం కోసం ప్రాణాలొడ్డే సైనికుడికి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు.. కానీ, ఆ సైనికుడు అలా దేశాన్ని రక్షిస్తోంటే, స్వేచ్ఛగా దేశంలో బతుకుతోన్న మనలో ‘కొందరికి’ మాత్రం, దేశభక్తిని చాటుకోవడానికి ‘మతం’ అడ్డంకిగా మారిపోతోంది.